🏦 Aadhar Bank Link Status
ప్రస్తుతం మనకి ఏ సంక్షేమ పథకం రావాలన్న తప్పనిసరిగా Aadhar Bank Link Status ( NPCI ) ఉండాలి. లేకపోతే సంక్షేమ పథకాలు రావు. ఇప్పుడు మన మొబైల్ లో మనము మన ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది. డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదో చెక్ చేద్దాం.. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.
📝 ముఖ్యమైన అప్డేట్ :
పథకం లబ్ధిదారులు తమ ఆధార్ నంబర్‌ను బ్యాంక్ ఖాతాతో మరియు NPCIతో లింక్ చేయడం తప్పనిసరి. ఈ ప్రక్రియను జూన్ 5, 2025 లోపు పూర్తిచేయాలి. లింకింగ్ చేయని లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు అందుబాటులో ఉండవు.
🤱 తల్లికి వందనం స్కీమ్
“తల్లికి వందనం” పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమం. ఈ పథకం కింద అర్హత కలిగిన తల్లులకు రూ.15,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది.
తాజాగా ఈ పథకంపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15,000 నగదు జమ చేయనుంది. అయితే, ఈ మొత్తం పొందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్తోపాటు ఎన్పీసీఐతో జూన్ 5 లోపు లింక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
🏦 NPCI Link అంటే ఏమిటి?
NPCI Link అనేది మీ ఆధార్ నంబర్‌ను బ్యాంక్ ఖాతాతో లింక్ చేయడం (seeding) అనే ప్రక్రియ. దీని ద్వారా మీరు ప్రభుత్వ పథకాల నుండి వచ్చే సబ్సిడీలు, నిధులు లేదా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్స్ (DBT) ను నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో పొందవచ్చు.
✅ NPCI Link ఉన్నప్పుడు ప్రయోజనాలు:
- 🎯 ప్రభుత్వ పథకాల ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలో డబ్బు వస్తుంది (ఉదాహరణకు: తల్లికి వందనం, పీఎం కిసాన్, గ్యాస్ సబ్సిడీ).
- 📲 AEPS ద్వారా ఆధార్ ఆధారంగా నగదు ఉపసంహరణలు చేయవచ్చు.
- 💸 మీ ఆధార్ మాత్రమే ఉంటే చాలు – నగదు తీయడం, ట్రాన్సాక్షన్స్ చేయడం సులభం అవుతుంది.
⚠️ NPCI Link లేకపోతే:
- మీరు ప్రభుత్వ సబ్సిడీలు లేదా పథకాలు పొందలేరు.
- బ్యాంక్ ఖాతాలోకి డబ్బు రాదు, తిరిగి పంపబడే ప్రమాదం ఉంటుంది.
- AEPS సేవలు ఉపయోగించలేరు.
✅ How to Check Aadhar Bank Link Status ( NPCI )
ఫ్రెండ్స్ నేను మీకు క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి. ఆ తర్వాత మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోండి.
- గవర్నమెంట్ కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ని మనం ఓపెన్ చేయాలి.
- ఆ తర్వాత మనకి హోమ్ పేజీ పైన Consumer అని ఆప్షన్ కనిపించడం జరుగుతుంది. మీరు ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- అప్పుడు మీకు కొన్ని ఆప్షన్స్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అందులో మీరు Bharat Aadhar Seeding Enabler ( Base ) అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి.
- మళ్లీ మీకు స్క్రీన్ మీద కొన్ని ఆప్షన్స్ కనిపించడం జరుగుతుంది అందులో Aadhar Mapped Status అని ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- తర్వాత మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ మరియు ఒక క్యాప్చర్ చేయండి.
- ఆధార్ కార్డుకి లింక్ అయినా మొబైల్ నెంబర్ కి ఓటిపి రావడం జరుగుతుంది. ఆ ఓటిపిని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డు కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. ఈ క్రింద చూపించిన ఇమేజ్ లో విధంగా ఉంటే మీకు అన్ని సంక్షేమ పథకాలు వస్తాయి.

- పైన చూశారు కదా ఆ ఇమేజ్లో చూపించిన విధంగా మీకు సంబంధించి మ్యాపింగ్ స్టేటస్ ఇనేబుల్ అయితే ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. ఇంకేస్ అక్కడ ఏదైనా సరే రాంగ్ గా ఉంటే వెంటనే మీ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి కొత్త అకౌంట్ లేదా ఉన్న అకౌంట్ ని npci లింక్ చేసుకోండి.
- అలాగే మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింకు అయింది కూడా బ్యాంకు పేరు ఇవ్వడం జరుగుతుంది.
- ఈ క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసుకొని మీకు సంబంధించి ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో చెక్ చేసుకోండి.
🧲 NPCI Link Status :– Click Here
🔍 Latest Jobs :- Click Here
📌 Aadhar Bank Link Status Checking Process
అందరికీ బాగా అర్థమయ్యే విధంగా ఉండాలని ఉద్దేశంతో ఆన్లైన్లో ఎలా Aadhar Bank Link Status చెకింగ్ ప్రాసెస్ క్రింద ఇచ్చిన వీడియోని క్లిక్ చేసి మీ మొబైల్ లోనే npci స్టేటస్ చెక్ చేసుకోండి.
📽️ Demo Video :- Click Here
🎉 పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా మీతోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.. ధన్యవాదములు.
Leave a Comment