Maharashtra Metro Rail Recruitment 2025
Maharashtra Metro Rail Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ డిప్లొమా లేదా బీ.టెక్ పాస్ అయితే చాలు మహారాష్ట్ర మెట్రో రైలు లో ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview Of Maharashtra Metro Rail Recruitment 2025
మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి వెకన్సీస్ ఉన్న సెక్షన్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు భర్తీ చేసుకునేందుకు అధికారంగా నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా డిప్లొమా లేదా బీ.టెక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు అవుతారు. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును.
Eligibility
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- అభ్యర్థులు తప్పనిసరిగా డిప్లొమా/బీ. టెక్/బీ. ఈ పాస్ అయ్యి ఉండాలి.
- పోస్టులకు సంబంధిత విభాగంలో కొంత పని అనుభవం కలిగి ఉండాలి.
Age Limit
అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే వారికి ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.
- అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 4-07-2025 నాటికి 32 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు ఉండాలి.
Salary Details
ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ అనేది నెలకు రూ.40,000 నుంచి రూ.2,40,000 వరకూ ఇస్తారు. అయితే ఈ శాలరీ అనేది అభ్యర్థులు ఎంపిక అవ్వ బడిన పోస్ట్ మీద ఆధారపడి ఉంటుంది.
Selection Process
అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అయితే వీరికి నిర్వహించే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.
- Skill Test
- Aptitude Test
- Medical Test
- Personal Interview
- Document Verification.
Post’s Details
ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా మొత్తం 151 పోస్టులను రిలీజ్ చేశారు. అయితే అభ్యర్ధుల యొక్క పని అనుభవం మరియు స్కిల్స్ ను బట్టి వారిని చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, సెక్షన్ ఇంజనీర్ పోస్టులకు ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు నాగపూర్, పూణే, తానే, నవి ముంబై లో పోస్టింగ్ ఇస్తారు.
Application Fee
ఈ పోస్టులకు అప్లై చేసుకునే సమయం లో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
- UR/OBC/EWS అభ్యర్థులకు రూ.400/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
- SC/ST/మహిళా అభ్యర్థులకు రూ.100/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
How To Apply
ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన www.mahametro.org ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి. హోమ్ పేజీ లో ఉన్న కెరీర్ సెక్షన్ కు వెళ్లి, ఈ రిక్రూట్మెంట్ పై క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత, అప్లికేషన్ ఫామ్ ను నింపిన, అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజును చెల్లించి, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
Important Dates
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం మహారాష్ట్ర మెట్రో రైలు కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.
Application Starting Date : 12-06-2025.
Application Last Date : 04-07-2025.
✅ Important Link’s
మెట్రో రైల్ కు సంబంధించి సమగ్ర సమాచారం అనగా జాబ్ నోటిఫికేషన్ మరియు ఆన్లైన్లో అప్లై చెయ్ లింక్ అఫీషియల్ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేయగలరు.
🔥 Notification PDF Download | Click Here |
🔥 Official Website Link | Click Here |
🔥 Latest Govt Jobs | Click Here |
✅ ఇవి కూడా చదవండి 👇
🔥 తల్లికి వందనం స్కీమ్ రిలీజ్ డేట్ | Click Here |
🔥 ఏపీ లో 74 కొత్త పెన్షన్ల లిస్టు రిలీజ్ | Click Here |
🔥 ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ స్టేటస్ | Click Here |
🔥 మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి | Click Here |
♻️ గమనిక :: ప్రతిరోజు లేటెస్ట్ జాబ్స్ కోసం మరియు సంక్షేమ పథకాల కోసం మా వెబ్సైట్ ని డైలీ విజిట్ చేయగలరు. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే తప్పకుండా మీతోటి మిత్రులకు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Leave a Comment